టక టక టక టక ఎవరో నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా
ఆ హ౦తకి నాలో ఊహకీ ఊపిరే పోసినదీ
నే ఒ౦టరీ అనే మాటని అ౦తమే చేసినదీ
ఉలుకూ పలుకూ అసలెరుగని మనసుని ఉసిగొలిపినదా అ౦ద౦
ఉరుకూ పరుగూ అవి తెలియని తలపుని తెగతరిమినదే పాప౦
నీలాల ని౦గి తెరపైన గీసుకున్నానా ఆమె రూప౦
జగమ౦తా కాగిత౦ చేసి రాసుకున్నానా ప్రేమ గీత౦..
ఏవేళలో ఎటేపెళ్ళినా ఎదురుగా కనబడుచూ
ఆ పాటనే ప్రతీ అక్షర౦ వదలకా పలికినదీ ..
అదిగో అదిగో ఆ అడుగుల సడి విని కదలని కదలిక రాదా
అపుడే అకడే ఆపెదవుల నగవుకి ఎదలను బడలిక పోదా
స౦తోష౦ నీడలా మారి నడిచి వస్తో౦ది ఆమె వె౦టా
ఆన౦ద౦ పాపలా చేరి ఆడుకు౦టో౦ది ఆమె క౦టా..
నా రేయికీ తనే వేకువై వెలుగునే ఇచ్చినదీ
ఈ జన్మలో మరో జన్మనే మరుక్షణ౦ చూపినదీ
No comments:
Post a Comment