22 June 2010

ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా

ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా .. బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా .. అమ్మరా

మేఘాల పల్లకి తెప్పిస్తా .. లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా .. చల్లనీ హాయినందిస్తా (2)

||ఆటలపాటల||

అడుగులే పడుతుంటే .. ఎదనిలా తడుతుంటే
మధురమౌ భావాలేవో మోగే లోలోనా ..
పలుకులే పైకొస్తే .. చిలిపిగా పిలుపిస్తే
పులకలే పదులై వేలై పొంగే నాలోనా ..

లాలిపాటే నేనై .. లాలపోసే వాణ్ణై
లాలనే నింపనా లేత హృదయానా !

||మేఘాల పల్లకి||
||ఆటలపాటల||

ఎగురుతూ నీ పాదం .. ఎదుగుతూ నీ రూపం
ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం
అడుగుతూ కాసేపూ .. అలుగుతూ కాసేపూ
అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం

క్షణములెన్నౌతున్నా .. వయసు ఎంతొస్తున్నా
పాపవే పాపవే నాన్న నయనానా !

||మేఘాల పల్లకి||
||ఆటలపాటల||
||మేఘాల పల్లకి||

No comments: