పల్లవి:
సుందరి నీవే నేనంట
చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంట
జన్మకై తోడే నేనుంటా
గుండెలో నిండమనటా
నీడగా మారమంటా
నా సిరి నీవేనటా
||సుందరి||
చరణం:
అనుకున్న మాటలు సర్వం కరిగి పోతే న్యాయమా
మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా
రేపవలు ఇద్దరి లోనూ ఎద నీ తోడే కోరునూ
యుధ్ధాల ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును
ఎద తెలుపు ఈ వేళా ఏల నీ శోధనా
జాబిలిని నీవడుగూ తెలుపు నా వేదనా
నాలో ప్రేమే మరిచావు
ప్రేమే నన్నే గెలిచేనే
కానుకే ఇచ్చా మనసంతా
జన్మకై తోడే నేనుంటా
||సుందరి||
చరణం:
పూవులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే
ఊహలే పూలై పూచు నీ ఎద మాటున చేరితే
మాసాలు వారాలౌనూ నీవు నేను కూడితే
వారాలు మాసాలవును బాటే మారి సాగితే
పొంగునే బంధాలే నీ దరి చేరితే
గాయాలు ఆరేనూ నీ ఎదుట ఉంటే
నీవే కదా నా ప్రాణం
నీవే కదా నా లోకం
||సుందరి||
No comments:
Post a Comment