14 June 2010

చిన్ని చిలక రా...వరాల చిట్టితల్లి వెన్నెలొలికె రా...

చిన్ని చిలక రా...వరాల చిట్టితల్లి వెన్నెలొలికె రా...
చిలిపి చినుకు రా మనింట నిత్యమల్లె సిరులు చిలికె రా..
సాగి వచ్చె రా నిండు జాబిలి... చిందులేసె రా గుండె లోగిలి
కిల కిల పలికె రా సెలయేరు లా...

||చిన్ని చిలక రా||

పాడు పడిన పూల తోటలో పాలపిట్ట కూతలొచ్చి పలకరించె రా...
మోడు చెట్టు గుండె కొమ్మలో గూడు కట్టి కమ్మనైన కధలు చెప్పె రా...
తడబడే లేత అడుగులో మొలిచె రా కోటి మెరుపులు
తల్లీ నీ రాక తో ఎదలో ఉగాదులు మళ్ళీ ఎన్నాళ్ళకో మల్లెల మారాకు లు
గల గల తరగల సంతోషాలు....

||చిన్ని చిలక రా||

ఎన్ని యేళ్ళు గడిచిపోయినా కళ్ళు విడని నిదురలొనే ఎదురు చూసినా
ఘడియ లోనె కరిగి పోయినా చెలిమి కలని వెతికి వెతికి అలసి పోయినా...
నీడలా ఉన్న జ్ఞాపకం నిజములా మారె ఈ క్షణం....
పాప నీ నవ్వులో పూచే దీపావళి...పలికే సిరిమువ్వలై తుళ్ళే ఈ అల్లరి...
ఉరుకులై పరుగులై ఊరేగాలి....

||చిన్ని చిలక రా||

No comments: