జోరులో బజారులో కుర్ర కారు జారు వేళ లో...
షైరు లో ఉషారు లో సర్రు మంటు సాగు దారిలో...
ఎందు చేత ఆగిపోయెనో దీని వైనమేదో చూడు నాయనో...
మోడలేమో మంచి మోడరన్ రా మోటరేమో క్రీస్తు పూర్వం రా..
వెంటనే ట్రబులేదో బాగు చేయ్ ఓయ్ బాబొ పాబ..ప్పాబ.ప్పాబ ప్పా....
||జోరులో||
మీ ఉన్నోళ్ళ వాహనం చెడితే మా షెడ్డు పావనం
మా చిన్నోళ్ళ జీవనం నడిపే మా మంచి సాధనం
ఏ చిక్కొచ్చినా ఈ దిక్కుకే రావాలి తప్పదు...
తలలే వంచాలి అప్పుడూ...
అంతా బాగుంటె స్పీడే స్పీడు...
తేడా వచ్చింద తంటా చూడు...
మ్యానో మిషనో ఏదైనా అదే కద....
||జోరులో||
నీ బాధేంటె మారుతీ చెబితే తేలుస్త సంగతి...
నీ సేవే మా పరపతి.. మాకేమిస్తావో బహుమతి
మా గ్యారేజి లో మారాణికే వైటింగు తప్పదు
త్వరగా అవమంటె కుదరదు...
వచ్చే వేగం తో పోదే జబ్బు...
ఖర్చే పెట్టాలి టైమూ డబ్బు
మ్యానో మిషనో ఏదైనా అదే కద....
||జోరులో||
No comments:
Post a Comment