14 June 2010

యెద నట్టింటను మెట్టిందొక మధుకధ

యెద నట్టింటను మెట్టిందొక మధుకధ
నర్తించెను మత్తిల్లిన సుమ సుధ..
రూపెత్తిన ఆనందం ఆగేనా... ||యెద నట్టింటను||

దివి లక్షింతల అక్షింతలు కురియగ..
నిద్రించని విద్యుల్లత విరియగ...
చేపట్టిన వాసంతం వాడేనా...
శుభ మూర్తం పిలిచింది
సుర ద్వారం తెరిచింది
నవ రాగం రాగా....

||యెద నట్టింటను||

నీలి వనిలో తారకా ఈ అవనికే జారగా
గాలి అలలే గాన కళలై రేయి హృదయం పాడదా...
వాలు కనులే కోరగా పూల తలలే చేరగా
తేనె తడిపే వేళ తలపే హాయి లయలో ఆడదా
వెలుగు నిజమైనా వలపు ఋజువైనా...
కళ్ళు మూసె చూడనీ వరాన్ని
రెప్ప విడితె కల ఔనో....

||యెద నట్టింటను||

మల్లె మురిసే వేళల వెల్లి విరిసే వేడుకా
ప్రాణ లత కు ప్రణయ శృతిలో మేలు కొలుపై చేరదా
ఇంద్ర ధనువే మాల గా పేద ఎద పై వాలగా
భావి బ్రతుకు దేవి కొరకు పూజ గదిగా మారదా
ఇలకు ఇకపై నా విరుల జడివాన
మౌనమైన రాగమాలపించు
మరుల ఝరుల విరి వాన

||యెద నట్టింటను||

No comments: