14 June 2010

కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో

కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో
కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో
ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో
సిగ్గే తీరక చిర్రెక్కుతున్నదు సింగారంలో
ముంచావే మైకంలో
దించావే నన్నీ మాయదారి హాయివేడిలో ||కొ కొ కోమలి||

నీదేహంతో స్నేహం కావాలింకా
ఐపోతానే నేనీ కోకా రైకా
కలివిడిగా నువు కలపడగా అతిగా
నిలవదిక చెలి అరమరిక సరిగా
నిగనిగ నిప్పుల సొగసులు చిమ్మక
మిల మిలలాడే ఈడు జాడ చూడనీ ఇక ||కొ కొ కోమలి||

సింగంలాగా ఏంటా వీరావేశం
శృంగారంలో చూపించాలా రోషం
దుడుకుతనం మా సహజగుణం చిలకా
బెదరకలా ఇది చిలిపితనం కులుకా
సరసపు విందుకు సమరము ఎందుకు
తళతళలాడే తీపి ఆకలి తీరనీ ఇక ||కొ కొ కోమలి||

No comments: