మౌనం లో స్వరం దాచిందా నిజం
ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం
చేజారే వరం మరిచిందా గతం
ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం
బదులిస్తావనీ పిలిచేలోపుగా వదిలేస్తాననీ అనుకోలేదుగా
కాలం మారినా నీ కధ మారదా || మౌనం లో ||
ఎన్నో తీపి జ్ఞాపకాల కానుకా
మనసే నిన్ను వీడి ఉండలేదికా
ఎంతో చేరువైన నింగి తారకా
అందీ అందనంటు ఏడిపించకా
అద్దం లోని అందమా అర్ధం కాని బంధమా
గుమ్మం లోనే ఆగకే
ఉన్నా లేని మాయగా కన్నీరైన వేడుక
నీలో నువ్వే దాగకే
విన్నాపాలు చూడనంటు ఉన్నమాట చెప్పవెందుకే || మౌనం లో ||
కనిపిస్తావు లోకమంత నువ్వుగా
వెలుగౌతావు కంటిపాప నవ్వుగా
ఔనంటావు తేనె పూత మాటగా
కాదంటావు లేత గుండె కోతగా
కలిసే పూల దారిగా అనిపిస్తావు నేస్తమా
దూరం పెంచే తీరమా
కసిరే ముళ్ల బాటగా నడిపిస్తుంది నీ భ్రమ
నీతో స్నేహం నేరమా
స్వగతాల తోరణాలు వాడుతున్న జాలి చూడవే || మౌనం లో ||
No comments:
Post a Comment