03 June 2010

నింగి నేల తాకే చోట సముద్రాన్ని దాటే చోట

నింగి నేల తాకే చోట సముద్రాన్ని దాటే చోట

ఎక్కడైన వేచి వుంటా నా చెలి చిరునవ్వు కోసం

పువ్వుకున్న అందం లాగ నవ్వుకున్న చందంలాగ

నీ చిత్రం చూసుకుంటా నీశ్వాశగ మారి వుంటా

అమృతాల పాల నవ్వు ఆశతీర అందుకుంటా

చందమామ వెడి మోము రెండు కళ్ళ దాచుకుంట || నింగి నేల ||

తూరుపింట దీపం లాగ చీకటింట జాబిలిలాగ

నీ ప్రేమను పగలూ రేయీ కోరుతోంది నా ఊపిరి

పువ్వుకున్న అందం లాగ నవ్వుకున్న చందంలాగ

నీ చిత్రం చూసుకుంటా నీశ్వాశగ మారి వుంటా

ఋతువులన్ని మారిపోనీ లోకమంత చీకటవనీ

నీవెంటే నేను ఉంటా నీ ఉనికిగ మారి పోతా || నింగి నేల ||

No comments: