04 June 2010

సయ్యారి నాఎంకి వయ్యారి వల్లంకి కనిపెట్టి పట్టాలిరా

||పల్లవి||
సయ్యారి నాఎంకి వయ్యారి వల్లంకి కనిపెట్టి పట్టాలిరా
సింగారి నారంగి బంగారి సారంగి కనికట్టు కట్టాలిరా
మరి గట్టి ఒట్టుపెట్టి..... భూమంత చాపచుట్టి
జాబిలిని బతిమిలాడి..... సూరీడ్ని చితకబాది
పడదాం.... గుట్టు..... రట్టేచేయ..... చేయ
ఎరుపు..... బొట్టు..... ఛామన్‌ఛాయ.... ఛాయ
ఒక క్షణము మనము నిలువ వలదు ఉరకని ఉరుకుల పరుగులుగా
తన ఉనికిగనక కునుకు తగదు గడవని గొడవల ఘడియలురా
ఇదిరా తరుణి తరుణం మిగతా తరువాతరా..... ||సయ్యారి||

||చరణం 1||
చిరుతత్తరది..... కడుబిత్తరది లలనా......
బలెచక్కనిది... బహుటక్కరిది జాణా.......
అరె ఎక్కడ ఎక్కడ చప్పున చెప్పర తొందరగున్నదిరా
ఇంతకుముందర ఎప్పుడు చూడని వెన్నెలసానిదిరా
చిక్కులుపెట్టుట చక్కగ నేర్చిన టక్కులమారిదిరా
హా..... ఇక్కడె ఇక్కడె పక్కనె పక్కనె నక్కుతు ఉన్నదిరా
ఇలలో కలగా మెరిసే మగువను విడలేనురా........ ||సయ్యారి||

||చరణం 2||
ఎందిర ఇది సుందరి అని రందిన పడుతూ.......
మాపని సరి తన్నులుతిని రంకెలు పెడుతూ....
మది మరచిన మన కళలను తను తడుమునురా
వెలుగారిన తెలుగందం తల నిమురునురా
సృష్టే ఏమైనా నా దృష్టే తనపైన
ఎవరు ఎదురైనా ఇక నన్నే ఆపేనా
ఆ అందం ఆ చందం ఆ పరువం ఆ గర్వం ఆ సర్వం అది నా సొంతం ||సయ్యారి||

No comments: