నా మనసో నల్లని మేఘం నీవు చిరు గాలి సోయగం
నిన్ను తాకి కరిగేనే ధనియించిన జీవితం
కనులనుండి జారే ప్రతి నీటి బింబం
మది నిండిన నిన్నే చూపుతుంది సాక్షమై
నీ మనసో చల్లని సాయం నీవే కలలాంటి ఓ నిజం
నిన్ను చేరి పులకించి పొంగుతున్న యవ్వనం
కలనైనా నను వీడీ పోకు నేస్తమా!
వర్షించు ఈ మేఘం నా సొంతమయ్యింది
హర్షించె ఈ హ్రుదయం జవరాలి జత కలిసే
పులకించె ఈ తనువు నీ బాహు బంధంలో
పలికాయి రాగాలే నీ మ్రుదు స్పర్శలతో
ఈ రాగ బంధం ఏ నాటి వరమో...
శ్రీవారికా కోపం కావలదు శాస్వతం
శ్రీదేవి తోడు ఉంటే నా జగము శాంతమే
చెరి సగము అయ్యేటి గడియొకటి సెలవియ్యవా
అణువూణువు నీవేలే వశమవ్వు వరమివ్వవే
ప్రతి జన్మ లోను నా తోడు నీవేలే
No comments:
Post a Comment