04 June 2010

నీపై నాకున్నది ప్రణయం అయితే అదే నా జీవితం

నీపై నాకున్నది ప్రణయం అయితే అదే నా జీవితం
నీ మదిలో చోటే మరణం అయితే అదే నాకు శరణం
నమ్మవే నా చెలి నా ఊపిరే నీవని
నీవే నాకు భాగ్యం...నీ తోడే నాకు శరణ్యం
నీవే నాకు భాగ్యం...నీ తోడే నాకు శరణ్యం

వేకువలా వచ్చిన నవ్వు మలిసంద్యన మరుగున పడితే
వెన్నెల్లా వచ్చిన నువ్వు నిశి రాత్రి ప్రమిదయ్యావు
వెల్లువంటి ప్రేమ జల్లు పై హరివిల్లై నువ్వొచ్చావు
గుప్పెడంత హౄదయానికి అలవికాని కలలు ఇచ్చావు
ఏ దేవుడు వరమిచ్చాడొ...ఈ దేవత కరుణించింది

వలపందిన చీకటి ఉచ్చులో చిక్కుకున్న నా మనసు
వలదన్న వాకిలి తెరిచి బిగి కౌగిలి సేవిచ్చావు
ముత్యమంత స్వఛత నీది తొలిముద్దై మురిపించావు
పట్టరాని ఆనందాన్ని కౌగిలిలో అందించావు
ఏ పూజల ఫలమో నీవు ... నీ ప్రేమకు పాత్రుడనైతి

No comments: