04 June 2010

చిరుగాలి వీచెనే... చిగురాశ రేపెనే

చిరుగాలి వీచెనే... చిగురాశ రేపెనే
చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో.. రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడెనే
కరుకైన గుండెలొ.. చిరుజల్లు కురిసెలే
తనవారి పిలుపుతో..
ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే

చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళమేసి చెలరేగిపోయెనే

చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో.. రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడెనే

తుళ్ళు తున్న చిన్ని సెలయేరు.. గుండె లోన పొంగి పొలమారు
అల్లు కున్న ఈ బంధమంతా..వెల్లు వైనదీ లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే.. నేల తల్లి వంటి మనసల్లే
కొందరికే హృదయముంది..నీ కొరకే లోక ముందీ
నీకు.. తోడు ఎవరంటూ.. లేరు.. గతములొ
నేడు.. చెలిమి చెయి చాపే.. ఆరె బతుకులో
కలిసిన బంధం..కరిగిపోదులే..
మురళి మోవి విరిని తావి కలిసిన వేళా

||చిరుగాలి||

ఓ.. మనసున వింత ఆకాసం.. మెరుపులు చిందె మనకోసం
తారలకే తళుకు బెళుకా..ప్రతి మలుపు ఎవరికెరుక
విరిసిన ప్రతి పూదోట..కోవెల వొడి చేరేనా
రుణ మేదో మిగిలి ఉంది.. ఆ తపనే తరుముతోందీ
రోజు పూయలే ఊగె రాగం గొంతులో
యేవొ పదములే పాడె మోహం గుండెలో
ఏ నాడు.. తోడు లేకనే
కడలి ఒడిని చేరుకున్న గోదారల్లె

కరుకైన గుండెలొ.. చిరుజల్లు కురిసెలే
తనవారి పిలుపుతో..
ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళమేసి చెలరేగిపోయెనే

No comments: