ఒక మౌనం ఒక మౌనం... నా పెదవిని వీడిచిన ఈ తరుణం...
మధు మాసం మధు మాసం... తొలిపలుకులు నేర్పిన సావాసం...
ముళ్ళు మొలిచే బాటలో... పూలు విరిసే సంబరం...
పగలు రేయీ ఏకమై నా ఎదలో ఆశలే గువ్వ లై ఎగెసే ఈ వేళ...
||ఒక మౌనం||
నేను ఎవరో...నేను ఎవరో ఏవిటో తెలియదు నేటి దాకా..
కంటి పాప దాచి వుంచే కలలనే చూపలేక..
గమ్యం తెలియక ఒంటరిగా నడిపిన చీకటి ఘడియల్లో...
పొద్దే విచ్చే బ్రతుకునకు అర్ధం నేడు తెలిసినదే..తెలిసినదే..ఓ..ఓ..ఓఓ..
||ఒక మౌనం||
నా మదిలో..నా మదిలో ఊహలేవో వలవేసి లాగుతుంటే..
జతకు చేరే చెలిమి ఏదో కడదాక వీడనంది..
ఇన్నాళ్ళకు గుండెలలో ఆశల సడినే విన్నాలే...
నే కన్నా కలల కనుల ముందే రెక్కలు తొడిగీ ఉరికెను లే..
ఉరికెను లే..ఓ..ఓ..ఓఓ..ఒక మౌనం...ఒక మౌనం..
||ఒక మౌనం||
No comments:
Post a Comment