05 June 2010

సీతారాముల కళ్యాణము చూతము రారండి

సీతారాముల కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
చూచువారలకు చూడముచ్చటట
పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట ||2||
భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట... ||2||
సురలును మునులును చూడవచ్చునట
కళ్యాణము చూతము రారండి ||శ్రీ సీతారాముల||

చరణం 1

దుర్జన కోటిని దర్పమడంచగ
సజ్జన కోటిని సంరక్షింపగ ||దుర్జన||
ధారుణి శాంతిని స్ధాపన చేయగ ||2||
నరుడై పుట్టిన పురుషోత్తముని ||కళ్యాణము||
చరణం 2

దశరధరాజు సుతుడై వెలసి
కౌశికు యాగము రక్షణ చేసి ||దశరధ||
జనకుని సభలో హరవిల్లు విరచి ||2||
జానకి మనసు గెలిచిన రాముని ||కళ్యాణము||

చరణం 3

సిరి కళ్యాణపు బొట్టును బెట్టి
మణిబాసికమును నుదుటను గట్టి
పారాణిని పాదాలకు బెట్టి
పెళ్లి కూతురై వెలిసిన సీతా ||కళ్యాణము||

చరణం 4

సంపంగి నూనెను కురులకు దువ్వి
సొంపుగ కస్తూరి నామము దీర్చి
చెంప జవ్వాజి చుక్కను బెట్టి ||2||
పెండ్లికొడుకై వెలసిన రాముని ||కళ్యాణము||

చరణం 5

జానకి దోసిట కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపు రాసై
ఆణిముత్యములు తలంబ్రాలుగా ||2||
శిరముల మెరిసిన సీతారాముల ||కళ్యాణము||

No comments: