సిరిసిరిమువ్వా..విరిసిన పువ్వా..
చెకుముకి రవ్వా..ఓ ఓ ఓ ఎగిసిన జువ్వా
కెరటం సాగదా..నీ వెనుకే
మెరుపే ఆగదా..నవ్వులకే
ఆ నింగిలో..వెన్నెలకే..కన్నెదోమ కుట్టిందా నిన్ను చూసాకే
సిరిసిరిమువ్వా..విరిసిన పువ్వా..
చెకుముకి రవ్వా..ఓ ఓ ఓ ఎగిసిన జువ్వా
తూరుపే మేలుకొనగా..ఎదుటే వాలిన వెలుగే నువ్వా
రేయితో చేయి కలిపిన వెన్నెల పూతల సెలవే నువ్వా
బ్రహ్మకే ఆశ రేపిన..గుడిలో తారకా
నువు సయ్యంటేనే సయ్యా..చల్ చయ్యా..చల్ చయ్యా..
అడుగేసావంటే హయ్యో..తకతయ్యా తకతయ్యా
జడగంటలు మ్రోగే జోరే..జలపాతం పాదం తీరే
గుడిగంటల్లాగా మ్రోగే గుండెల్లో వెలుగై చేరుకోవే
కెరటం సాగదా..నీ వెనుకే
మెరుపే ఆగదా..నవ్వులకే
ఆ నింగిలో..వెన్నెలకే..కన్నెదోమ కుట్టిందా నిన్ను చూసాకే
సిరిసిరిమువ్వా..విరిసిన పువ్వా..
చెకుముకి రవ్వా..ఓ ఓ ఓ ఎగిసిన జువ్వా
ఘల్లుమని కాలి మువ్వలు..జతులే పాడే జయగీతాలు
స్నేహమే ఏడురంగుల..అలలైపొంగే ఆనందాలు
ముంగిటే రంగవల్లులు..తీర్చిన వైనాలూ
ఆకాశం అందే దాకా..పడవల్లో పరవళ్ళే
పాతాళం అంటే చూసే..వయసంతే వరదల్లే
ఇక చిందే వెయ్యాలమ్మో..కనువిందే చెయ్యాలమ్మో
ఆ నాలుగు దిక్కులు ఏకం అయ్యే వేడుకని చూడనీవే
సిరిసిరిమువ్వా..విరిసిన పువ్వా..
చెకుముకి రవ్వా..ఓ ఓ ఓ ఎగిసిన జువ్వా
కెరటం సాగదా..నీ వెనుకే
మెరుపే ఆగదా..నవ్వులకే
ఆ నింగిలో..వెన్నెలకే..కన్నెదోమ కుట్టిందా నిన్ను చూసాకే
సిరిసిరిమువ్వా..విరిసిన పువ్వా..
చెకుముకి రవ్వా..ఓ ఓ ఓ ఎగిసిన జువ్వా
No comments:
Post a Comment