07 June 2010

ఈ గాలిలో.. ఊరేగు రాగాలలో..ఈ వేళనా..మనవిని వినవా

ఈ గాలిలో.. ఊరేగు రాగాలలో..ఈ వేళనా..మనవిని వినవా
ఈ ఊసులే.. నా గుండె లోగిళ్ళలో..దాచానులే.. మనసును కనవా

నాలో..లో లోనా.. నిన్నే చూస్తున్నా..నువ్వే విన్నా విడలేని శ్వాసనా
రోజూ..నీడల్లే..నిన్నే వెంటాడే..పాదం కానా..కడదాక సాగనా

ఈ గాలిలో ఊరేగు రాగాలలో..ఈ వేళనా మనవిని వినవా

పూసే..పువ్వా..ఇది విన్నావా
కూసే..గువ్వా..ఇటుగా వాలవా
మువ్వా..నువ్వూ..దయచేసావా
పువ్వులా విరబూస్తున్నా..గువ్వలా ఎగిరొస్తున్నా
మువ్వలా నవ్వుతున్నా..నన్ను చూడవే

తెలుపరే ఇకమీదైనా..మారదా మన తీరైనా
గుండెలో ప్రేమై రానా !

ఈ గాలిలో ఊరేగు రాగాలలో..ఈ వేళనా మనవిని వినవా
ఈ ఊసులే నా గుండె లోగిళ్ళలో..దాచానులే మనసుని కనవా

నిన్నా..మొన్నా..కలగన్నానా
నేడే..నన్నే..ఎద కవ్వించెనా
రేయీ..పగలూ..తన ధ్యాసేనా
ఇంతగా వారిస్తున్నా..చెంతకే రానంటున్నా
ఎందుకీ మనసుకి మాత్రం ఇంత యాతనా
జంటగా ముడిపెడుతున్నా..జంకితే ముడి దొరికేనా
జన్మకే బంధం కానా !

No comments: