07 June 2010

పుత్తడిబొమ్మ.. పూసిందమ్మా పువ్వమ్మ.. సెలయేరమ్మా..

పుత్తడిబొమ్మ.. పూసిందమ్మా పువ్వమ్మ.. సెలయేరమ్మా..
కొమ్మా రెమ్మా కనరండమ్మా
మిన్నుల బ్రహ్మ..చేసాడమ్మ ఈ బొమ్మా.. ఇదిగోనమ్మా..
ఇంతటి అందం యాడుందమ్మా!

దివిలో తారా.. నిను తరలించారా..
ఈ పూటకి మా సిరివే నువ్వనుకున్నారా
చిరుబుగ్గల్లో నేడే.. నునుసిగ్గులు పండే
తొలిపైటంచు తోడై.. పండింది నేడే.. కన్నే గీటే కన్నె ఈడే

పుత్తడిబొమ్మ.. పూసిందమ్మా పువ్వమ్మ.. సెలయేరమ్మా..
కొమ్మా రెమ్మా కనరండమ్మా
మిన్నుల బ్రహ్మ..చేసాడమ్మ ఈ బొమ్మా.. ఇదిగోనమ్మా..
ఇంతటి అందం యాడుందమ్మా!

మలిసంజెల్లో..ఆ ఎరుపే తీసి..
మారాణికి పారాణిగ సింగారించండి
చిరు చీకట్లు అద్ది.. అహ.. అహా..
తన కాటుక దిద్దీ..ఆహ.. ఆ
ఆ జాబిల్లి దీపం హారతి పట్టి..
నింగీ నేలా దీవించండి

పుత్తడిబొమ్మ.. పూసిందమ్మా పువ్వమ్మ.. సెలయేరమ్మా..
కొమ్మా రెమ్మా కనరండమ్మా
మిన్నుల బ్రహ్మ..చేసాడమ్మ ఈ బొమ్మా.. ఇదిగోనమ్మా..
ఇంతటి అందం యాడుందమ్మా!

ఈ విరహాలూ ప్రేమే అనవా
నా మది పాడే ఊసే వినవా
ఈ పదహారు ప్రాయం కనవా
నా చెలికాడే నీవైనావా.. రావా !

నా ఎదలోనా ఏదో తపనా
నే తొలిసారి నేడే చూసా
ఈ కడప్రాణం నీదే అననా
నా ప్రతి శ్వాసా నీకై తీసా.. ఇలా !

మునిమాపుల్లో.. ఆ మలిమలుపుల్లో..
చిగురేసే ప్రతి ఆశా పువ్వై పూస్తుంటే
సుమగంధాలు చల్లి.. సుమగంధాలు చల్లి
అనుబంధాలు అల్లి.. అనుబంధాలు అల్లి
ఇరు హృదయాలు తేలి.. ముంగిట్లో వాలి
పాడేనమ్మా తుళ్ళీ తుళ్ళీ..

రంగులలోకం రెక్కలు విప్పీ రమ్మందీ
ఒడిలో చేరీ కమ్మని స్వప్నం కనమంటోందీ
నిన్నటి ప్రాయం తీయని స్నేహం కోరిందీ..
వెయ్యేళ్ళైనా వీడని బంధం తానంటోందీ!

No comments: