చిరుగాలులతో నే అడిగా
సిరివెన్నెలతో నే అడిగా
నిరుపేద జీవితంలో ఈ ప్రేమ వరమౌతుందా
చిరుగాలులతో నే అడిగా
సిరివెన్నెలతో నే అడిగా
నిరుపేద జీవితంలో ఈ ప్రేమ వరమౌతుందా హో
(కొత్తగా పుట్టానా ఇన్నాళ్ళకీ
ఎందుకీ సంతోషం కన్నీళ్ళకీ..)
గతమే పెనుచీకటైనా
బ్రతుకే వెలిగించినావే
నా ఎడారి దారులలో అలైనావే హో
కరిగే కనుపాపలోనా
కలలే కలబోసినావే
కుహూరవాల ఆమనివై వరించావే హో
ఇది నిజమే అనుకోనా
ప్రతి మలుపూ కలయేనా
మది అవుననన్నా మరి కాదన్నా నీలో నేనున్నా !
చిరుగాలులతో నే అడిగా
సిరివెన్నెలతో నే అడిగా
నిరుపేద జీవితంలో ఈ ప్రేమ వరమౌతుందా హో
ఎపుడో చిననాటి స్నేహం
ఎదుటే ఎదిగింది ప్రేమై
ఒక ఋణానుబంధంలా మూడేవేసే..వా
ఎదలో వెతలెన్ని ఉన్నా
ఒడిలో ఓదార్పు నీవే
ఈ సుదూర పయనంలో జతైనావే హో
మరబొమ్మై పడి ఉన్నా
మరుజన్మే ఇచ్చావే
ఇక క్షణమైనా నిను విడిచానా ఊపిరి ఆగేనా !
చిరుగాలులతో నే అడిగా
సిరివెన్నెలతో నే అడిగా
నిరుపేద జీవితంలో ఈ ప్రేమ వరమౌతుందా
చిరుగాలులతో నే అడిగా
సిరివెన్నెలతో నే అడిగా
నిరుపేద జీవితంలో ఈ ప్రేమ వరమౌతుందా హో !
No comments:
Post a Comment