సరదాగ ఈ సమయం, చేసేన మనతొ పయనం ||
నీ జతలో, ఈ నిశిలో, నా అడుగే, ఏ దిశలో?
తెలిసేనా చివరికైనా? చెలిమేదో చేరువౌనా?
ఓ దూరమా, ఇది నీ వైనమా?
దోబూచులె ఇక చాలించుమా ||
చూసవటే ఓ పంతమా, నీ వల్లనే ఈ బంధమా ||
ఈ నిమిషం తనతొ పయనం, అనుకొనీ చిత్రమైనా...అనుకొనీ చిత్రమేనా?
నాతో తను నడిచే హాయిలో, ఆపేదెలా నిను ఓ కాలమా ||
ఈ సంబరం నా సొంతమా ? చేజారకే ఓ స్వప్నమా ||
ఆ ఉదయం పిలిచే లొగా, ఈ స్నేహం ముడిపడేనా.. ఈ స్నేహం ముడిపడేనా?
No comments:
Post a Comment