14 June 2010

ఓమనసా ఓమనసా చెబితే వినవా నువ్వు

ఓమనసా ఓమనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా

ఎగసిపడే అలకోసం దిగివస్తుందా ఆకాశం
తపనపడీ ఏం లాభం అందని జాబిలి జతకోసం
కలిసి వున్న కొంత కాలం వెనక జన్మ వరమనుకో
కలిసిరాని ప్రేమ తీరం తీరిపోయిన ఋనమనుకో
మిగిలే స్మృతులే మనవకో మనసా

తన వడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక
తననొదిలీ వెల్లకనీ ఏ బంధాన్నీ కోరదుగా
కడలిలోనె ఆగుతుందా కదలనంటూ ఏ పయనం
వెలుగువైపు చూడనందా నిదర లేచే నా నయనం
కరిగే కలనే తరిమే ఓ మనసా

No comments: