14 June 2010

ఏమైంది సారు ఏంటా హుషారు

ఏమైంది సారు ఏంటా హుషారు
బాగుంది జోరు వూరంత హోరు హొయ్ హొయ్

ఆనందమొస్తే ఇంతే కాదా అందరూ
ఆరాలు తీసే వింతే లేదే నమ్మరు

సససై సైర సైర ససససై సైరసైర....

హే చాల్లే జతులు చెడిపోవా మతులు
ఇల్లాంటి కుప్పిగంతులు వేస్తార చెప్పు నీలాంటి బుద్ధిమంతులు
హె ఎన్నో పనులు వెనకబడి తరిమేటపుడు
తీరిగ్గ చమ్మచక్కలు ఆడేదెలాగ చెప్పండె అమలక్కలు

ఆహా చూసాం లే ఎంత భారం నువు మోసే రాచ కార్యం
చేస్తాంలే మేము సైతం చేతనైన సాయం

సససై సైర సైర ససససై సైరసైర....

వేసే అడుగు ఎటువైపో అడుగూ
ఏ నింగి చుక్కవరకు తూరంగిలాగ నీ కొంటె గాలి పరుగు
తీసే పరుగు బిడియపడి ఆగే బెరుకూ
పెళ్లీడు ఆడపిల్లకే వుండాలి కాని మాలాంటి వాళ్లకెందుకు

అరెరెరె అబ్బాయీ నీ బడాయి ఆకాశం తాకెనోయీ
మాతోనా నీ లడాయి చాలు ఆపవోయి

సససై సైర సైర ససససై సైరసైర....

No comments: