11 June 2010

జయ జయ రాం జయ రఘురాం జయ జయ రాం

జయ జయ రాం జయ రఘురాం జయ జయ రాం జయ రఘురాం
జగధబి రాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే (2)
జగధబి రాముడు శ్రీరాముడే
జనకుని మాటన తలపై నిలిపి
తన సుఖముల విడి వనితావణి తో వనములకేగిన సర్వావతారుడు
జగధబి రాముడు శ్రీరాముడే

కరమున ధనువు శరములు దాలిచి కరమున ధనువు
కరమున ధనువు శరములు దాలిచి ఇరువది చేతుల బలమే పూనిచి
సురలను గాంచిన వీరాధివీరుడు
జగధబి రాముడు శ్రీరాముడే

ఆలుమగల అనురాగాలకు ఆలుమగల అనురాగాలకు
పోలిక సీతారాములే అనగా పొలిక సీతారాములే అనగా
వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు
జగధబి రాముడు శ్రీరాముడే

నిరతము ధర్మము నెరపీ నిలిపీ..నిరతము ధర్మము నెరపీ నిలిపీ
నరులకు సురలకు తరతరాలకు ఒరవడి అయినా వర యుగపురుషుడు
జగధబి రాముడు శ్రీరాముడే

ఇనకులమని ధరి చూచే తనయుడు అన్నయు ప్రభువు లేనే లేడని
ఇనకులమని ధరి చూచే తనయుడు అన్నయు ప్రభువు లేనే లేడని
జనులు భజించే పురుషోత్తముడు
జగధబి రాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జగధబి రాముడు శ్రీరాముడే
జయ జయ రాం జయ రఘురాం జయ జయ రాం జయ రఘురాం

No comments: