11 June 2010

ఊహల్లోన ఒదిగిన ఆశే నీవై అలజడి

ఊహల్లోన ఒదిగిన ఆశే నీవై అలజడి పుట్టిస్తావు ప్రియమదనా
హృదయంలోన తరగని ధ్యాసే నీవై తపనలు పెంచేస్తావు ఇదితగునా
శ్వాసల్లోనా స్వరాలు మ్రోగిస్తావు అంతేలేని వరాలనందిస్తావు
మాయో హాయో నీకిది తగునా నేనే నీవై పోతున్నా నీలో సాగే శ్వాసల సెగతో

ప్రతిక్షణం అలై జ్వలించే సోయగం తపించదా ఇలా వరిస్తే సాహసం (2)
పొంగే నదినై సముద్రాలే దాటుతున్నా సాగే సుధలై సరాగాలే పాడుతు
వెంటాడే నీడై నను ఇలా వేధిస్తావేలా రసికరా... మదనా....
ఊహల్లోన ఒదిగిన ఆశే నీవై అలజడి పుట్టిస్తావు ప్రియమదనా

ప్రియా మధూకర మదించే ఆశలా సఖి సమీరమై కురిస్తే ఏలరా (2)
మూస్తే కళ్ళే మరో లోకం చేరుతున్నా వీచే గాలై అలా పైకి తేలగా
నా గానం నీవై దాహమా ఏదేదొ చేస్తావేంటలా వరమా

ఊహల్లోన ఒదిగిన ఆశే నీవై అలజడి పుట్టిస్తావు ప్రియమదనా
హృదయంలోన తరగని ధ్యాసే నీవై తపనలు పెంచేస్తావు ఇదితగునా
శ్వాసల్లోనా స్వరాలు మ్రోగిస్తావు అంతేలేని వరాలందిస్తావు
మాయో హాయో నీకిది తగునా నేనే నీవై పోతున్నా నీలో సాగే శ్వాసల సెగతో

No comments: