తీయని ఈ నిజం చెప్పనా... నిను చేరింది మనసే...
దాగని ఈ నిజం విప్పనా... నిను కోరింది వయసే...
నా ప్రతీ ఊహలో నువ్వే ఉన్నావనీ...
ఈ ప్రియ భావనా తెలిపే రోజేదనీ...
నిలదీసాను చిరుగాలినీ...
||తీయని||
యవ్వనం నిధిలా దాచి..ఇవ్వనా కానుక చేసి
వేచి... తలుపు తెర తీసీ...
తారలా మెరిసే చెలికి చేరనా తళుకై దరికి
నీడై ఆమెకొక తోడై...
ఇలా ఎంత కాలం సదా బ్రహ్మచర్యం...
ఎలా చేరుకోను ప్రియా ప్రేమ సౌధం...
తెలియకనే అదిరినదా అధరం...
నా యెదలో నీ స్వప్నం మధురం...
దరి చేరాలి మురళీధరా...
||తీయని||
నిన్ను నా సిగలో తురిమి చెయ్యనా త్వరగా చెలిమి
యోగి.. ప్రేమ రసభోగి...
రాలుతూ చినుకై ఎదుట రాత నై చెలి నీ నుదుట
వుంటా పైట పొదరింటా
ఎలా దాచుకోను ప్రియా కన్నె ప్రాయం...
ఇలా ఇవ్వరాదా చెలీ సొగసు దానం...
నీ తలపే ప్రతి నిముషం మురిపెం..
నీ కొరకే నా హృదయం పయనం...
ఇటు రావయ్య నవ మన్మధా...
||తీయని||
No comments:
Post a Comment