03 June 2010

ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు......

||పల్లవి||
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు...... నాలొ అలజడి రేపిందీ నీ చిరునవ్వు......
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు...... నాలొ అలజడి రేపిందీ నీ చిరునవ్వు......
నా కన్నులొన నీ రూపం....నాకన్నా ఎంతో అపురూపం..........
అనిపించే చిన్నారి.........ఈ అనుభూతే నాకు తొలిసారి......||ఇంతందంగా||

||చరణం 1||
నిన్ను చూస్తె నిన్నలేని చలనం నాలోన నాలోన
కన్ను మూస్తె నిన్ను కలిసే కలలే ఓ లలన
ఎందుకొ నా గుండెలోన ఎదో హైరాన హైరాన
ఎంతమంది ఎదుటవున్న వొంటరినౌతున్నా
ఈ అల్లరి నీదేనా నను అల్లిన థిల్లాన
అనుకున్నాన మరి నాలోన ఈ నమ్మని కమ్మని కథ మొదలౌనని.......||ఇంతందంగా||

||చరణం 2||
మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్నా చూస్తున్నా
నెనుమాత్రం నిన్ను చూస్తు కలవరపడుతున్నా
ఊహలన్ని వాస్తవాలై నీలా మారేనా మారేనా
ఊపిరేదో రూపమైతె అది నీవే మైనా
అ దైవం ఎదురైన ఈ భావం నిలిచేనా
అనుకున్నాన మరి నాలోన ఈ నమ్మని కమ్మని కథ మొదలౌనని.......||ఇంతందంగా||

No comments: