07 June 2010

వయసు వయసు వయసు వరసనున్నది వాటం

వయసు వయసు వయసు వరసనున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి........
వేసారి......
శృతిమీరే.....
సుఖమయ ఋతువుల మధువులనడిగిన ||వయసు వయసు||

ఉదయం చుంబన సేవనం మద్యాహ్నం కౌగిలి భోజనం
సాయంత్రం పుష్ప నివేదనం రాతిరివేళల మహనైవేద్యం
మనసు మనసుల సంగమం తనువుకు తనువే అర్పణం
తొలివలపుల సంతర్పణం......
మరెందుకాలస్యం......
ప్రియమారా.....
దరిచేరా.....
బిగువేరా.....
సరసకు రారా వీరా ధీరా ||వయసు వయసు||

నీవేలేని నేనట నీరేలేని ఏరట
కాలాలన్ని కౌగిట మదనుని శరముల స్వరములు విరియగ
తారా తారా సందునా ఆకాశాలే అందునా
నీకు నాకు వంతెన....
అమాస వెన్నెలలో....
పరువానా...
స్వరవీణా....
మృదుపాణి......
సరస మధురమయ లావణి పలికిన ||వయసు వయసు||

No comments: