చిరుగాలీ చిరుగాలి చెలియ జాడ చూపాలీ...
నాకు నీవు తోడు కావాలీ... ||చిరుగాలీ||
ఒక సారి దరి చేరి ఊసు తెలుప రావా...
కడదాకా చెలితోనే చేయి కలపవా నా తోడై....
|| చిరుగాలి ||
కంటి పాప జంట చూపు చుక్క నీవు కావా...
ఎండ మావి వెంట పడ్డ బాటసారి కానా...
గూడు లేని గువ్వ పిట్ట నీడలేని దోవా...
గోరువంక సాగరాన ఈదుతున్న నావ...
చెప్పలేను ఈ బాధా ఎక్కడుందో నా రాధా...
వేణువుండి నా చేతా వేదనాయె నా రాతా...
ఎంత తీపి ప్రేమ రాలు పూల ఓలే
అంతులేని శోకం మనసా....
|| చిరుగాలి ||
No comments:
Post a Comment