హీరో నేనొచ్చానే... మీకే టీ ఇస్తానే....
హీరో నేనొచ్చానే...మీకోసం మీకోసం...
టీలెన్నో తెచ్చానే...మీకోసం మీకోసం...
కలిపేసే లెమన్ టీ..వేడి వేడి గా లమ్సా టీ..
అందించే ఇంకోటీ...ఆర ఆరగా అంధ్రా టీ..
ఇది పడితే కదిలే రధమే మనిషీ...
తీస్కోర నా టీ... ఇది అన్నింట మేటీ...
లేదింక పోటీ... ఆపైన భేటీ...
||హీరో నేనొచ్చానే||
లక్ష గాడు తాగే టీ...బిక్ష గాడు మెచ్చే టీ...||2||
లక్షణం గ తాగేస్తే రక్ష నీకు ఇచ్చే టీ...
అచ్చమైన అస్సాం టీ.. వెచ్చనైన నైజాం టీ...
ఒక్క కప్పు నాకిస్తే నీ మత్తు దులుపు చక్రా టీ...
కుర్ర వాళ్ళు తాగే టీ...పెద్ద వాళ్ళ టీపార్టీ...
ఆడవాళ్ళు పెట్టే టీ.. ఆడ ఈడ దొరికే టీ...
సరిగ రీస ససరిసాగ దదసపాగ పపదపాగ
తధీం తకిట..తధీం తకిట..తధీం తకిట..తకిట తకిట థాం
||హీరో నేనొచ్చానే||
అత్త మామ అడిగే టీ.. భర్త మార్కు భార్యా టీ...||2||
అతిధి దేవుడొస్తుంటే అర్జంటు గా పెట్టే టీ...
పల్లె లోనా పారే టి... పట్టణాన ఛాయే టీ...
ఒక్కరైతె సింగిల్ టీ.. ఎక్కువైతె ఒన్ బై టీ...
ఎక్కడైన దొరికేటీ.. ఏరువాకలయ్యే టీ...
ఎంత లోడు ఉంటే ఎంటీ..ఉత్సాహం గ్యారెంటీ...
సరిగ రీస ససరిసాగ దదసపాగ పపదపాగ
తధీం తకిట..తధీం తకిట..తధీం తకిట..తకిట తకిట థాం
||హీరో నేనొచ్చానే||
No comments:
Post a Comment