కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే
పలికే.. స్వరాలే ఎదకే.. వరాలై
పదాలు పాడు వేళలో కలవరమాయే.. మదిలో
మనసునే తొలి మధురిమలే వరి౦చెనా
బతుకులో ఇలా సరిగమలే రచి౦చెనా
స్వరములేని గాన౦ మరపు రాని వైన౦
మౌనవీణ మీటుతు౦టే కలవరమాయే.. మదిలో
ఎదగని కలే ఎదలయలో వరాలుగా
తెలుపని అదే తపనలనే తరాలుగా
నిదురపోని తీర౦ మధురమైన భార౦
గు౦డెనూయలూపుతు౦టే కలవరమాయే.. మదిలో
No comments:
Post a Comment