07 June 2010

తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న థిల్లాన

తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న థిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
ఏ చిన్ని సందళ్ళు విన్నా ఈ గుండె చాటున
నా గొంతు వాకిళ్ళలోన ఆ పాట దాగునా?
దరి చేరే స్వరము నాకు వరము
ప్రతి రోజూ పదము పాడే సమయాన
నన్నే నీలో కన్నా

||తొలి||

కొమ్మ చాటుగా పల్లవించు ఆ గండు కోయిలమ్మ
గొంతులోని నా తేనెపట్టునే తాను కోరేనమ్మా
పరుగాపని వాగులలోనా కదిలే అలలే
నా పలుకుల గమకం ముందు తల వంచెనులే
ఎగిసే తేనె రాగాలు నీలిమేఘాలు
తాకితే చాలు నింగి లోగిళ్ళు
జల్లై విల్లై తుళ్ళు

||తొలి||

ప ప స స ద
స స ద
ప ప ప ప గ
స ని ప గ రి
స స ద గ ప
ద గ ప
గ ప స గ ప రి
ప ద ని స గ రి గ రి గ రి గ రి
ప ద ని స రి గ రి గ రి గ రి గ
ప ద ని స గ గ
ప ద ని స గ గ
ప ద ని స గ

ఇన్ని నాళ్ళుగా కంటి పాపలా పెంచుకున్న స్వప్నం
నన్ను చేరగా సత్యమవ్వదా నమ్ముకున్న గానం
పెదవంచున సంగతులన్నీ శ్రుతులై లయలై
ఎదనూపిన ఊపిరులవని స్వర సంపదలై
బతుకే పాటలా మారు బాటలో
సాగు ఆశలే తీరు రోజులే
చేరువయ్యే లైఫే హాయే

||తొలి||

No comments: