మాతృదేవోభవ! పితృదేవోభవ!
ఆచార్యదేవోభవ!
పల్లవించనీ నా ప్రథమ కీర్తనం
ఒక మాతృప్రేమకే ఓంకారముగా
ప్రణమిల్లి పాడనీ నా హృదయ స్పందనం
ఒక తండ్రి కలలకే సాకారముగా
జన్మను పంచిన జననీ జనకుల
ఆలనలే ఆలాపనగా
అనురాగములే ఆలంబనగా
||పల్లవించనీ||
నిప్పులలో నడిచింది నిన్నటి ఆ సీత కథా
ఆరని మంటయ్యింది ఒంటరి నా అమ్మ కథా
కడుపు తీపినే పెంచాయేమో తను మోసిన నవ మాసాలు
కడకు భర్తనే కాదని తానే గడిపిందా వనవాసాలు
శిలనైనా కరిగించే సామవేద సంగీతం
పచ్చని ఆ దాంపత్యానికి పాడిందొక చరమ గీతం
ఏనాటికి ముడి పడుతుందో ఏడడుగుల ఈ సంబంధం
విడదీసిన ఏడు స్వరాలే కలిపేనా ఆ అనుబంధం
గగస రిరిగ ససప దదప రిగపగస గపదసరి పదసరి
||పల్లవించనీ||
మురిపాలను తాగినదమ్మా నీ ఒడిలో ఈ పసి ప్రాణం
సరిగమలను నేర్పినదమ్మా నాన్నలోని అమృత గానం
తప్పటడుగులేసిన నిమిషం తల్లి చాటు తనయే ఐనా
తాళగతిని వీడని లక్ష్యం తండ్రి వెంట నడిపించింది
గురువే...
గురువే నా తండ్రిగ మారి కన్న గుర్తు చూపిస్తుంటే
జాలి లేని ఆ విధి రాతే తననే బలి పెడుతూ ఉంది
ఆ మృత్యువు రాతి గుండెని నా గానం కరిగిస్తుందా?
చెదిరిన మమ గూటికి చేర్చి తన ప్రాణం నిలబెడుతుందా?
రీ రీ రి స రీ రి స రీ గా గ రి రి స ద
స దా ప గ ప ద ప గ రి
రీ గ గా గ రి గా గ రి గ ప గా గ రి గ ప గ రి స దా
ద స ద ప
ప ద ద స స రి
ద ద స స రి రి గ గ ప
స స రి రి గ గ ప ప ద
రి రి గ గ ప ప ద ద స
గ గ ప ప ద ద స స రి
~ రి గ రి గ రి రి గ రి గ రి రి గ రి గ గ ప గ
గ గ రి గ గ రి గ గ రి గ రి స ద
రి రి స రి రి స రి రి స రి స ద ప
ద ద ప ద ద ప ద ద ప ద ప గ రి
గ గ రి గ గ రి గ గ రి గ రి స ద
ససస రిరిరి గగగ పపప దదద ససస రిరిరి
రిరిరి గగగ పపప దదద ససస రిరిరి గగగ
గగగ పపప దదద ససస రిరిరి గగగ పపప
పద పద పద పగరిగ
పద పద పద పగరిగ
పప దప దప దప దప దప దప దప సా
No comments:
Post a Comment