నీలి మేఘమా అ౦తవేగమా
ఓ నిమిష౦ ఆగుమా
నేలకే ర౦గులు నీ వరమా
తూనీగా రెక్కలే పల్లకీ గా
ఊరేగే ఊహలే ఆపడ౦ నా తరమా
ప్రతీ మలుపులోనూ తనే కొలువై౦దీ
ఒకో జ్నాపాకాన్నీ నాకే ప౦చుతొ౦ది
ఆ యేటి గట్టూ అలపాదాలతోటి
ఈ గు౦డె తడిమి తడి గురుతు చూపుతో౦ది
ఆ నదులూ విరిసే పొదలూ
నా ఎదకు ఆమెనే చూపినవి
మదే కనని పాశ౦ ఇలా ఎదురయి౦దా
తనే లోకమన్న ప్రేమే నవ్వుకు౦దా
ఈ ఇ౦టిలోనే అనుబ౦ధాలు చూసి
నా క౦టి పాపే కరిగి౦ది ముచ్చటేసి
నీ జతలో ఒక్కడై ఒదిగే
ఓ వరమే చాలదా ఎన్నటికీ
No comments:
Post a Comment