14 June 2010

కార్యేషు దాసి, కరణేషు మంత్రి

కార్యేషు దాసి, కరణేషు మంత్రి
భోజ్యేషు మాత, శయనేషు రంభ

అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా |2|
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా

అపురూపమైనదమ్మ .....

పసుపు తాడు ఒకటె మహాభాగ్యమై, బ్రతుకుతుంది పడతి అదే లొకమై
మగని మంచి కొసం పడే ఆర్తిలో, సతిని మించగలరా మరే ఆప్తులు
ఏ పూజ చెసినా ఏ నోము నోచినా, ఏ స్వార్ధము లేని త్యాగం..
భార్యగ రూపమె పొందగ...

అపురూపమైన.... |2|

కలిమిలేములన్నీ ఒకే తీరుగా, కలిసి పంచుకోగా సదా తొడుగా
కలిసి రాని కాలం వెలి వేసినా, విడిచిపొని బంధం తనై ఉండగా
సహధర్మచారిణి..సరిలేని వరమని
సత్యన్ని కనలేని నాడు, మోడుగ మిగలడ పురుషుడు

అపురూపమైన.... |2|

మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా

కార్యేషు దాసి, కరణేషు మంత్రి
భోజ్యేషు మాత, శయనేషు రంభ

No comments: