04 June 2010

చట్టానికి కళ్ళులేవు తమ్ముడూ

చట్టానికి కళ్ళులేవు తమ్ముడూ... న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడూ.. ||2||
ఇక్కడున్నదొక్కటే....కొట్టి బతకడం దొంగ దొరై తిరగటం...

||చట్టానికి||

ఋజువయ్యిందే ఇక్కడ సత్యమటా...
వాదమాడి గెలిచిందే వేదమటా...||2 ఋజువయ్యిందే ||
పిల్లీ ఎలుకల నడుమా ఎందుకు సాక్ష్యం...హ..
పిల్లీ ఎలుకల నడుమా ఎందుకు సాక్ష్యం...
ఎలుకే పిల్లిని తిందని పెద్దల వాదం..
హ హ..పెద్దల వాదం...

||చట్టానికి||

గుడెసెలోన దొరికిందా సానిదటా...
మేడలోని ఆట నాగరీకమటా...
కూడు లేక ఒప్పుకుంటె నేరమటా...
తప్ప తాగి విప్పుకుంటె నాట్యమటా...
హ హ..అది నాట్యమటా....

||చట్టానికి||

ఒకరు నమ్ముకున్న దారి రాదారి...
ఒకరు ఎంచుకున్న దారి పెడదారి...
మార్గాలే వేరు గాని గమ్యం ఒకటే...
ఎవరు గెలిచినా గానీ గెలుపు తల్లిదే...
గెలుపు తల్లిదే...

||చట్టానికి||

No comments: