పల్లవి:
నీలో విరిసిన అందాలన్నీ
నాలో వీడని బంధాలాయె
నీలో పలికిన రాగాలన్నీ
నాలో శ్రావణ మేఘాలాయె
చరణం:
అల్లరి గాలి నిమిరే దాకా మల్లె మొగ్గకు తెలియదు...ఏమనీ
తానొక తుమ్మెదకై తపియించేననీ||2||
మూగ కోరికా ముసిరే దాకా||2|| మూసిన పెదవికి తెలియదు .. ఏమనీ
తానొక ముద్దుకై తహతహలాడేనని||2||
ఆ కోరికలే ఇద్దరిలోనా ||2||
కార్తీక పూర్ణిమలై వెలగాలి
||నీలో||
చరణం:
మధుమాసం వచ్చే దాకా మామిడిగున్నకు తెలియదు...ఏమనీ
తానొక వధువుగా ముస్తాబైనాననీ ||2||
ఏడు అడుగులు నడిచేదాకా||2|| వధూవరులకే తెలియదు..ఏమనీ
ఆ ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ ||2||
ఆ బంధాలే ఇద్దరిలోనా ||2||
కార్తీక పూర్ణిమలై వెలగాలి
నీలో విరిసిన అందాలన్నీ నా...లో వీడని బంధాలాయె
ఓ .. ఓ .. ఓ ... నీలో పలికిన రాగాలన్నీ నా..లో శ్రావణ మేఘాలాయె
No comments:
Post a Comment