18 June 2010

వెర్రి మనసా వేగిపోకే

పల్లవి:

వెర్రి మనసా వేగిపోకే
విరహమంటే వెండి మంటే
నీ తొవకదే వెలుగవుతుంది
ఒంటరిగా నిన్నొదలను అంది
మంటల మరగని బంగారానికి నగలై మెరిసే విలువేముంది
నెత్తురు చిందే గాయం కాంతుల్లో
కలలే నిజమయ్యే మజిలీ చేరుకోమందీ

చెలి చిలకా చెలి చిలకా
వింత పరుగులు చాలిక తుళ్ళి పడకా
మది మందిరంలో కొలువుండు కడవరకూ
||చెలి||


చరణం:

హే.....
మాయదారి మంచు మంట ఆరిపోక
కోరుకున్న మల్లె బాట కంటపడక
కలలు ఎండిపోవాలా...
వెన్నెలంటె తెలియదు వేడిలేకా
రాతిరంటే వేగు చుక్క పైడి బాట
ఆశ ఓడిపోదు
అలలలకి అలసట రాదు
విలవిల పెంచే ఈడుకు జతవై
చలువలు పంచే తొలి వలపేమో
ఒళ్ళో చేరుకుంటే ఓటమే ఓడదా

||వెర్రి||


చరణం:

సులువుగ దొరకవు ఏ పెన్నిధులు
గనులను తవ్వక అందవు మణులు
గమ్యం మనకు ఎదురై రాదుగా
కురవక నిలవదు నింగి మేఘం
చినుకుతొ చెదరద మన్ను మౌనం
నేనై పాడుతున్నా నిన్నే వేడుతున్నా
మనసుని మీటే మాటే విన్నా
నిలవని అడుగుల బరువౌతున్నా
నూరేళ్ళ వరకూ నీ తోడయ్యేందుకు

||వెర్రి||

No comments: