ఏ రాగముంది మేలుకొని ఉండి లేవనంటున్న మనసును పిలువగ
ఏ తాళముంది సీసమును పోసి మూసుకొనిఉన్న చెవులను తెరువగ
సంగీతమంటె ఏవిటో తెలిసి ఉండాలి మనకి ముందుగా అంత
సందేహముంటె తీర్చుకో గురువులున్నరు కనుల ముందుగా వెల్లి
నీలి మేఘాన్ని గాలి వేగాన్ని నింగి మౌనాన్ని అడగరా కడలి
ఆలపించేటి ఆతరంగాల అంతరంగాన్ని అడగరా మధుర
ప్రాణ గీతాన్ని పాడుతూ ఉన్న.. ఎద సడి నడిగితె
శ్రుతి లయ తెలుపద బ్రతుకును నడిపిన సంగతి తెలియద
ఏ రాగముంది మేలుకొనిఉండి లేవనంటున్న మనసును పిలువగ
ఏ తాళముంది సీసమును పోసి మూసుకొనిఉన్న చెవులను తెరువగ
ఏ సుప్రభాత గళముతో నేల స్వాగతిస్తుంది తొలితొలి వెలుగుని
ఏ జోలపాట చలువతో నింగి సేదదీర్చింది అలసిన పగటిని
స్వర్ణ తరుణాలు చంద్ర కిరణాలు జిలుగులొలికి పరుగు పలుకునెవరికి
మంచు మౌనాలు పంచమంలోన మధువు చిలుకు ఎవరి చెలిమి రవళికి
తోటలో చేరి పాట కచ్చేరి చేయమంటున్న వినోదమెవరిది
నేల అందాల పూల గంధాల చైత్ర గాత్రాల సునాదమెవరిది
పంచ వర్ణాల పింఛమై నేల నాట్యమాడేటి వేళలో మురిసి
వర్ష మేఘాల హర్ష రాగాలు వాద్యమయ్యేటి లీలలో తడిసి
నీరుగా నీరు ఏరుగా ఏరు వాకగా నారు చిగురులు తొడగగ
పైరు పైటేసి పుడమి పాడేటి పసిడి సంక్రాంతి పదగతులెవరివి
ఆరు కాలాలు ఏడు స్వరములతొ అందజేస్తున్న రసమయ మధురిమ
వినగల చెవులను కలిగిన హ్రుదయము తన ప్రతి పధమున చిలకద సుధలను
జోహారు నీకు సంద్రమా ఎంత ఓపికో అసలు అలసట కలగద
ఓహోహొ గాన్ గ్రంధమా ఎంత సాధనే దిశల ఎదలకు తెలియద
నీ గీతమెంత తడిమినా శిలలు సంగీత కళలు కావనీ ఎంత
నాదామౄతాన తడిసినా యిసుక రవ్వంత కరగలేదనీ తెలిసి
అస్తమిస్తున్న సూర్య తేజాన్ని కడుపులో మోసి నిత్యము కొత్త
ఆయువిస్తున్న అమ్రుతంలాంటి ఆశతో ఎగసి ఆవిరై అష్ట దిక్కులూ దాటి
మబ్బులను మీటి నిలువున నిమిరితె గగనము కరగద
జలజల చినుకుల సిరులను కురవగ అణువణువణువున
తొణికితె స్వరసుధ అడుగడుగడుగున మధువని విరియదా......హా
No comments:
Post a Comment