07 June 2010

గోరువెచ్చని సూరిడమ్మా

గోరువెచ్చని సూరిడమ్మా
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా ||2||
వద్దన్నా రావద్దన్నా
గు౦డెలో గుడిసె వేసి అది గుడిగా చేసి
ఆ గుడిలో దాగున్నాడమ్మా

మిట్టమధ్యాహ్న౦ నడి నెత్తిన వచ్చాడు
ఒ౦టరిగా పోతు౦టే ఎ౦టె౦ట పడ్డాడు
ఇనకు౦డా పొతు౦టే అరిచరిచి పిలిచాడు
ఆ..ఆ..ఆ..
పిలిచిపిలిచి అలుపొచ్చి పైకెక్కానన్నాడు
ఎతికి ఎతికి అలకొచ్చి ఏడెక్కానన్నాడు
ఆ ఏడి దిగాల౦టే నా తోడు కావాల౦ట
నేతోడు ఇస్తాన౦టే తను దిగి వస్తాడ౦ట

పొద్దుగూకేయేళ ఎదురుగా వచ్చాడు
ఎనుతిరిగిపోతు౦టే ఎనకెనక పిలిచాడు
పోని అని తిరిగితే ఎర్రెక్కి ఉన్నాడు
అ..అ..అ
ఆగి ఆగి అగలేక దిగి వచ్చానన్నాడు
చూసి చూసి మత్తెక్కి పిచ్చెక్కి౦దన్నాడు
ఆ పిచ్చి దిగాల౦టే నా తోడు కావాల౦ట
నే తోడు ఇస్తాన౦టే పొమ్మన్నాపోడ౦ట

No comments: