07 June 2010

వెన్నెలా వెన్నెలా

పల్లవి:
వెన్నెలా వెన్నెలా
మెల్లగ రావే పూవుల తేనెలే తేవే
వెన్నెలా వెన్నెలా
మెల్లగ రావే పూవుల తేనెలే తేవే
కడలి ఓడిలో నదులు ఒదిగి నిదుర పోయే వేళ
కన్నుల పైన కలలే వాలి సోలి పోయే వేళ
వెన్నెల||

చరణం:
ఆశ ఎన్నడు విడువదా
అడగరాదని తెలియదా
నా ప్రాణం చేలియా నీవే లే
విరగబూసిన వెన్నెల
వదిలివేయక్కె నన్నిలా
రారాదా ఎద నీదే కాదా
నిదుర ఇచ్చె జాబిలి నిదురలేక నీవే పాడినావా
వెన్నెల||

చరణం:
మంచు తేరలో కలిసిపోయి మధన సంధ్య తూగేనే
పుడమి ఒడిలో కల్లలు కంటూ పాపయి నువ్ నిదురపో
మల్లె అందం మగువ కెరుకా
మనసు బాధ తేలియదా
గుండె నిండా ఊసులే నీ ఎదుటనుంటే మౌనమే
జోల పాట పాడినా నే నిదురలేకా పాడిన
వెన్నెల||

No comments: