22 June 2010

నిలువుమా నిలువుమా నీలవేణి

నిలువుమా..
నిలువుమా నిలువుమా నీలవేణి నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ (నిలువుమా నిలువుమా)

అడుగడున ఆడేలే నడుము సొంపులా (2)
తడబడే అడుగుల నటనల మురిపింపుల (2)
సడిసేయక ఊరించే వయ్యారపు వొంపుల
కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపులా
నడచిరా నడచిరా నాగవేణి..నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ (నిలువుమా నిలువుమా)

అద్దములో నీ చెలువు తిలకింపకు ప్రేయసీ
అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి (2)
నా ఊర్వశి రావే రావేయని పిలువనా (2)
ఆ సుందరి నెఱనీకు నీగోటికి సమమౌనా
రాచెలీ నినుమదీ దాచుకోనీ (2)
నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ

నిలువుమా నిలువుమా నీలవేణి

No comments: