22 June 2010

మదన మనోహర సుందరనారీ

మదన మనోహర సుందరనారీ
మధుర దరస్మిత నయన చకోరీ
మందగమనజిత రాజ మరాళీ
నాట్యమయూరీ! అనార్ కలీ, అనార్ కలీ ..

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా, రాజసాన యేలరా (2)
రాజశేఖరా!

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా, రాజసాన యేలరా (2)
మనసు నిలువనీదురా, మమత మాసిపోదురా (2)
మధురమైన బాధరా! మరపు రాదు .. ఆ ...

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా, రాజసాన యేలరా
రాజశేఖరా

కానిదాన కానురా! కనులనైన కానరా! (2)
ఆ .. జాగుసేయనేలరా! వేగ రావవేలరా!
ఆ .. జాగుసేయనేలరా! వేగ రావవేలరా!
చేర రారా చేర రారా చేర రారా .....

No comments: