03 June 2010

మధుర మురళి హృదయరవళి

మధుర మురళి హృదయరవళి
అధరసుధల యమున పొరళి
పొంగే ఎద పొంగే
ఈ బృందావిహారాలలోనా
నా అందాలు నీవేరా కన్నా
మధుర మురళి హృదయ రవళి
ఎదలు కలుపు ప్రణయ కడలి
సాగే సుడి రేగే
ఈ బృందా విహారాలలోనా
ఎవరున్నారు రాధమ్మ కన్నా

గోధూళి వేళల్లో గోపెమ్మ కౌగిట్లో
లేలేత వన్నే చిన్నే దోచేవేళల్లో
పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో
నాజూకులన్నీ నాకే దక్కే వేళల్లో
పగలో అవతారం రాత్రో శృంగారం
ఎదలొ తారంగం శ్రీవారికీ
రాగాలెన్నైనా వేణువు ఒకటేలే
రూపాలెన్నైనా హృదయం ఒకటేలే
నాదే నీ గీతమూ ఇక నీదే ఈ సరసాల సంగీతం

హేమంత వేళల్లో లే మంచు పందిట్లో
నా వీణ ఉయ్యాలూగే నీలో ఈనాడే
కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో
ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే
ముద్దే మందారం మనసే మకరందం
సిగ్గే సింధూరం శ్రీదేవికీ
అందాలెన్నైనా అందేదొకటేలే
ఆరు ఋతువుల్లో ఆమని మనదేలే
పాటే అనురాగము మన బాటే ఓ అందాల అనుబంధం.

No comments: