బాదలో మె చంద్రమా దిల్ హి దిల్ మె చాంద్ నీ
ఘూంఘట్ కె పీచే ఖూభ్ సూరత్ సమజ్ మే బసే అ హ హ
మబ్బులో చందమామ మనసులో వెన్నెలమ్మ
మబ్బులోన చందమామ మనసులోన వెన్నెలమ్మ
తెరలమాటు సొగసు కాస్త తెలిసిన వేళా హ హ హ
లేతగాలి సోకగానె నీలిమబ్బు కరిగిపోయె
జాబిలమ్మ వెలగదా జాజివాన కురవదా
బిడియమే తీరిపోయి వడికితాను చేరదా
కనులతో ముద్దులాడి కౌగిలింతలీయదా
మోముచాటు చేసినా..మోహనమేగా
కన్ను నేను గీటగానే కన్నె సిగ్గు తీరిపోయె
జోరు ఇంక ఆగునా జారు పైట నిలుచునా
యెవ్వరెన్ని వాగినా యవ్వానాలు దా...
కొమ్మ పూలు పూయగా తుమ్మెదొచ్చి వాలదా
ఎంత దూరమేగినా చేరువకేగా
పాటంటి వయసు నాది పల్లవించు సొగసు నీది
చరనమైన సాగదా చెలిని నేను చేరగా
ప్రణయమే గానమైన హృదయ వీణ మ్రోగదా
పల్లకీ..? కొనా పడుచు ఆశ తీరదా
విరహ బాధ తీయని వేదన కాదా
No comments:
Post a Comment