నువ్వెళ్ళని చోటుంటుందా.. నువ్వెరుగని మాటుంటుందా..
గాలీ నన్ను రానీ నీ వెంటా..
నువు చూసొచ్చిన ప్రతి వింతా.. నేనెవ్వరికీ చెప్పొద్దా..
నీ ఊసులనే ఊ కొడుతూ వింటా..
ఒక్క చోట నిలవద్దు అంటు తెగ తరుముతున్న ఈ ఉత్సాహం..
దారి కోరి నిన్నడుగుతుంది స్నేహం..
ఆవారా హవా.. అదిరిపడి ఔరా అంటావా..
హాయిగా నాతో వస్తావా.. సాయపడతావా..
ఆవారా హవా.. అదిరిపడి ఔరా అంటావా..
హాయిగా నాతో వస్తావా.. సాయపడతావా..
||నువ్వెళ్ళని||
వేళా పాళా గోలీమార్.. విసిరేశా చూడు వాచీనీ..
అపుడపుడూ నవ్వుదామా టైంటేబిల్ వేసుకునీ..
దాగుడు మూతా దండాకోరు ఎవారికీ జాడ చెప్పమనీ..
ఇట్టే తప్పించుకోమా కాపేసే చూపుల్నీ..
పద్దతంటు పట్టించుకోని పాటల్లె సాగనీ పొద్దంతా..
ఒద్దు అంటు ఆపేది ఎవ్వరంటా...
కాటుక పిట్టల్లా కళ్ళెగిరి వాలిన చోటల్లా.
ఎన్ని వర్ణాలో చూడిల్లా.. వెలుగు పోగుల్లా..
ఆవారా హవా.. అదిరిపడి ఔరా అంటావా..
హాయిగా నాతో వస్తావా.. సాయపడతావా..
చెయ్యారా తాకరాదా వేకువనీ వెన్నెల్నీ..
గుమ్మం బయటే ఆపాలా ఎదురొచ్చే చిన్ని ఆశలనీ..
గుండెల్లో చోటు లేదా ఊరించే ఊహలకీ..
పంజరాన్ని విడిపించుకున్న బంగారు చిలకనయ్యే పోతా..
ఎగిరి ఎగిరి ఆకాశమందుకుంటా..
ఎల్లలు ఆగేనా అల్లరిగ దూకే వేగానా..
అదుపులో ఉంచే వీల్లేనా నన్ను నేనైనా..
ఆవారా హవా.. అదిరిపడి ఔరా అంటావా..
హాయిగా నాతో వస్తావా.. సాయపడతావా..
నువ్వెళ్ళని చోటుంటుందా.. నువ్వెరుగని మాటుంటుందా..
గాలీ నన్ను రానీ నీ వెంటా..
నువ్వెళ్ళని చోటుంటుందా.. నువ్వెరుగని మాటుంటుందా..
గాలీ నన్ను రానీ నీ వెంటా..
No comments:
Post a Comment