'నీకోసం దిగిరానా..నేనెవరో మరిచానా
నీడల్లే కదిలానా..నీవల్లే కరిగానా
నాకోసం నేన్లేనా..మనసంతా నువ్వేనా
ప్రేమంటే ఇంతేనా..కాదన్నా వింటేనా !'
అరెరే..అరెరే..మనసే..జారే
అరెరే..అరెరే..వరసే..మారే
ఇదివరకెపుడూ..లేదే
ఇది నా మనసే..కాదే
ఎవరేమన్నా..వినదే
తనదారేదో..తనదే
అంతా నీ మాయలోనే..రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ..నీ వల్లనే
అంతా నీ మాయలోనే..రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ..నీ వల్లనే
స్నేహమేరా..జీవితం అనుకున్నా
ఆజ్ మేరా..ఆశలే కనుగొన్నా
మలుపులు ఎన్నైనా..ముడిపడి పోతున్నా
ఇంక సెకనుకెన్ని నిమిషాలో
అనుకుంటు రోజు గడపాలా
మది కోరుకున్న మధుబాల..చాల్లే ఈ గోలా !
అంతా నీ మాయలోనే..రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ..నీ వల్లనే
అంతా నీ మాయలోనే..రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ..నీ వల్లనే
చిన్నినవ్వే..చైత్రమై పూస్తుంటే
చెంత చేరీ..చిత్రమే చూస్తున్నా
చిటపట చినుకుల్లో..తడిసిన మెరుపమ్మా
తెలుగింటిలోని తోరణమా
కనుగొంటి గుండె కలవరమా
అలవాటు లేని పరవశమా..వరమా..హాయ్ రామా !
అరెరే..అరెరే..మనసే..జారే
అరెరే..అరెరే..వరసే..మారే
ఇదివరకెపుడూ..లేదే
ఇది నా మనసే..కాదే
ఎవరేమన్నా..వినదే
తనదారేదో..తనదే
అంతా నీ మాయలోనే..రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ..నీ వల్లనే
అంతా నీ మాయలోనే..రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ..నీ వల్లనే
No comments:
Post a Comment