పాదమెటు పోతున్నా..
పయనమెందాకైనా..
అడుగు తడబడుతున్నా..
తోడు రానా..
చిన్ని ఎడబాటైనా..
కంట తడి పెడుతున్నా..
గుండె ప్రతి లయలోనా..
నేను లేనా..
ఒంటరైనా ఓటమైనా..
వెంట నడిచే నీడవేనా..
Oh My Friend..
తడి కన్నులనే తుడిచిన నేస్తమా..
Oh My Friend..
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా..
అమ్మ వడిలో..లేని పాశం..
నేస్తమల్లే..అల్లుకుందీ..
జన్మకంతా...తీరిపోనీ..
మమతలెన్నో..పంచుతోందీ..
మీరు మీరు నుంచీ..మన స్నేహగీతం..
ఏరా ఏరాల్లోకీ మారే..
మోమాటాలే లేనీ..కలే జాలువారే !
ఒంటరైనా ఓటమైనా..
వెంట నడిచే నీడవేనా..
Oh My Friend..
తడి కన్నులనే తుడిచిన నేస్తమా..
Oh My Friend..
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా..
వాన వస్తే..కాగితాలే..
పడవలయ్యే..జ్ఞాపకాలే..
నిన్ను చూస్తే..చిన్ననాటీ..
చేతలన్నీ..చెంతవాలే..
గిల్లి కజ్జాలెన్నో.. ఇలా పెంచుకొంటూ..
తుళ్ళింతల్లో తేలే స్నేహం..
మొదలో తుదలో తెలిపే..ముడి వీడకుందే..
ఒంటరైనా ఓటమైనా..
వెంట నడిచే నీడవేనా..
Oh My Friend..
తడి కన్నులనే తుడిచిన నేస్తమా..
Oh My Friend..
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా..
No comments:
Post a Comment