అందమైన అందమా ఓ చంద్రమా
నువ్వే అందుకోవె నిండుగా నా ప్రేమ
అంతులేని ఆత్రమా ఆరాటమా
నీకే ఎందుకమ్మ అంతలా ఆ ధీమా
ఓ ఎదలో ఊపిరి ఎదురుగ రూపమై
నిలబడి నందుకే ఈ ధీమా
ఎవరో చూడక ఎవరికి అందక
జతపడి నందుకే అంతా
అందమైన అందమా ఓ చంద్రమా
నువ్వే అందుకోవె నిండుగా నా ప్రేమ
నేను నాలో నాలో ఆలోచనలై
ఏలం ఏలం అంటూ ఆలాపనలై
నిన్ను నన్ను పిలిచే సాయంత్రములే
కన్ను కన్ను కలిపి ఏకంతములై
నా కలలనే పండించేనులే
ఈ నిజమునే అందించెనులే
అందమైన అందమా ఓ చంద్రమా
నువ్వే అందుకోవె నిండుగా నా ప్రేమ
నీపై నాపై కురిసే ఈ వెన్నలలే
ఆపై ఆపై మారే దీవేనలలై
నీడై తోడై కదిలే సంతోషములే
నేడే నీడై చేరే శృంగారములై
ఈ వరముతో స్నేహం చేసా
ఈ వలుపునే సొంతం చేసా
అందమైన అందమా ఓ చంద్రమా
నువ్వే అందుకోవె నిండుగా నా ప్రేమ
అంతులేని ఆత్రమా ఆరాటమా
నీకే ఎందుకమ్మ అంతలా ఆ ధీమా
No comments:
Post a Comment