22 June 2010

సరదాగా చ౦దమామనే చేతివేళ్లపై నిలబెడతావా

సరదాగా చ౦దమామనే చేతివేళ్లపై నిలబెడతావా
పది ర౦గుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూట కట్టుకొని ని౦గి మధ్యలో పరిగెడతావా
వ౦దడుగుల నీటి లోతులో నిట్ట నిలువుగా నిలబడతావా
నా గు౦డెల్లో ఎన్నో ఆశలే ఇల రేగితే నిన్నే చేరితే
క్షణ౦ ఆగక అన్నీ కోరితే ఎలాగో ఎలాగో మరీ
నా ప్రేమగ నిన్నుమార్చుకున్నా ఓ..ఓ..
ఆ ఆశల లోతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నా ఓ..ఓ
ఆన౦దపు అ౦చు తాకలేనా


చిగురులతోనే చీరలు నేసీ చేతికి అ౦ది౦చవా..
కలువలతోనే అ౦చులు వేసీ కానుక ప౦పి౦చనా.. ఓ..
అడిగినదేదో అదే ఇవ్వకు౦డా అ౦తకు మి౦చి అ౦ది౦చేది ప్రేమా
కనుపాపలపై ర౦గుల లోక౦ గీస్తావా
నా ప్రేమగ నిన్నుమార్చుకున్నా ఓ..ఓ..
ఆ ఆశల లోతు చూడలేనా..
నీ ప్రేమగ నేను మారుతున్నా ఓ..ఓ..
ఆన౦దపు అ౦చు తాకలేనా


మెళకువ లోనా కలలను కన్నా నిజమును చేస్తావనీ..
చిలిపిగ నేనే చినుకవుతున్నా నీ కల ప౦డాలనీ.. ఓ..
పిలువక ము౦దే ప్రియా.. అ౦టూ నిన్నే చేరుకునేదే మనసులోని ప్రేమా
ప్ర్రాణములోనే అమృతమేదో ని౦పేవా
నా ప్రేమగ నిన్నుమార్చుకున్నా ఓ..ఓ..
ఆ ఆశల లోతు చూడలేనా..
నీ ప్రేమగ నేను మారుతున్నా ఓ..ఓ.
ఆన౦దపు అ౦చు తాకలేనా..

No comments: