04 June 2010

గుచ్చి గుచ్చి గుండెల పై నే పచ్చబొట్టు రాశానే

గుచ్చి గుచ్చి గుండెల పై నే పచ్చబొట్టు రాశానే..
పచ్చ బొట్టు నీ పేరైనా మచ్చ లాగ చూశావే..
నీ ప్రేమ దొరికినా సమయాన కుడికన్ను అదిరెనని అనుకున్నా..
ఎడం వైపు గుండెలే పగిలేలా.. నా కలలన్నీ చిదిమేశావే..
ఎందుకే ఈ వేదనా ఊపిరాగే యాతనా
నేస్తమా నువ్ లేనిదే లోకమంత చీకటి కాదా..

||గుచ్చి గుచ్చి||

ఎద ఎంత కోసినా.. ఎద గొంతు మూసినా
చెలి చేతి స్పర్శ లో చేదైన తీయనా
ఆకలేసి ప్రేమా అంటే మనసు తుంచి పెట్టావే
అమ్మ కాని అమ్మవు నువ్వై అమృతాన్ని పంఛావే
పూలదారి పరిచింది నువే వేలుపట్టి నడిపింది నువే..
వెలుగు చూపి నా కన్ను పొడవకే కంటి లోన ఉన్నది నువ్వే..

||గుచ్చి గుచ్చి||

నిప్పు కాల్సినా నీరు ముంచినా ప్రేమ రంగు ఇది మారదు లే..
ఉరిమి చూసినా తరిమి వేసినా మది నీ ప్రేమను మరువదు లే..
రాక్షసున్ని మనిషిగ చేసి దేవత గా నిలిచావే..
రాతి గుండె రాగం పలికే కొత్త బాట చూఫావే..
స్వర్గమంటు ఒకటున్నదనీ పిలిచి చూపినది నీ నవ్వే..
దూరమై ఆ నరకమేమిటో చూపుతోంది నువ్వే నువ్వే..

||గుచ్చి గుచ్చి||

No comments: